విదుల్లోకి చేరిన పారిశుద్ధ్య కార్మికులు
నలభై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు శుక్రవారం విధుల్లో చేరారు. మంత్రి కేటీఆర్ తో పారిశుద్ధ్య కార్మికులు గురువారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లను రెండు నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు. ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో పారిశుద్ధ్య కార్మికుల సహాయం అవసరమని మంత్రి కేటీఆర్ కోరారు. వేతనాల పెంపు వంటి అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇవ్వడంతో వారు 44 రోజుల తర్వాత […]
Advertisement
నలభై నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు శుక్రవారం విధుల్లో చేరారు. మంత్రి కేటీఆర్ తో పారిశుద్ధ్య కార్మికులు గురువారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లను రెండు నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో వారు సమ్మె విరమించారు. ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి పథకంలో పారిశుద్ధ్య కార్మికుల సహాయం అవసరమని మంత్రి కేటీఆర్ కోరారు. వేతనాల పెంపు వంటి అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇవ్వడంతో వారు 44 రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరారు.
Advertisement