గంగా యమున యాత్రకు ఐఆర్‌సీటీసీ శ్రీకారం
ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్లను ప్రారంభించనుంది. అక్టోబరు 10వ తేదీన పవిత్ర గంగా యమున యాత్ర పేరుతో ఒక రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరనుందని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య గురువారం వెల్లడించారు. ఈ రైళ్లు అక్టోబరు నుంచి ప్రతి 15 రోజులకు ఒకటి నడుస్తాయని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి ఈ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ పర్యటనలో కాశీ విశ్వనాధ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ, త్రివేణి సంగమ స్నానం, గంగాస్నానం, […]
Advertisement
ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్లను ప్రారంభించనుంది. అక్టోబరు 10వ తేదీన పవిత్ర గంగా యమున యాత్ర పేరుతో ఒక రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరనుందని ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య గురువారం వెల్లడించారు. ఈ రైళ్లు అక్టోబరు నుంచి ప్రతి 15 రోజులకు ఒకటి నడుస్తాయని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి ఈ రైళ్లు ఇప్పటికే నడుస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ పర్యటనలో కాశీ విశ్వనాధ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ, త్రివేణి సంగమ స్నానం, గంగాస్నానం, హరిద్వార్‌లో మానసాదేవి మందిరం, ఢిల్లీలోని దర్శనీయ స్థలాలతో పాటు మధుర శ్రీృష్ణ జన్మభూమి తదితర దర్శనీయస్థలాలున్నాయి. పది రోజుల పాటు పర్యటన సాగుతుంది. 7 కోచ్‌లతో ఉన్న ఈ ఆధ్యాత్మిక రైల్లో 560 మంది ప్రయాణీకులకు అవకాశం ఉంటుంది. స్లీపర్‌లో ఒక్కొక్కరికి రూ. 9,100, థర్డ్ ఏసీలో రూ. 19,700లు, సెకండ్ ఏసీలో రూ. 26,500ల చొప్పున ప్యాకేజీలున్నాయి. బెర్తులు బుక్ చేసుకోదలిచిన వారు 040-27702407, 9701360648, 9701360615 ఫోన్ నెంబర్లను సంప్రదించాలి.
Advertisement