ట్యాపింగ్‌లో చ‌ర్య‌లు ఆపేయండి: హైకోర్టు 

విజ‌య‌వాడ భ‌వానీపురం పోలీస్ స్టేష‌న్లో న‌మోదైన కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్‌డేటాను స‌మ‌ర్పించాల‌ని బీఎస్ఎన్ఎల్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు విజ‌య‌వాడ కోర్టు  జారీ చేసిన ఆదేశాల‌ను   నిలిపేయాల‌ని గురువారం  హైకోర్టు ఆదేశించింది.  విజ‌య‌వాడ  సీఎంఎం కోర్టు ఆదేశాల‌పై తెలంగాణ  హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అజ‌య్‌మిశ్రా గురువారం హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేయ‌గా ధ‌ర్మాస‌నం విచారించింది. ఆ మూడు స‌ర్వీస్ ప్రొవైడర్లు స‌మ‌ర్పించిన కాల్‌డేటాను సీల్డ్ క‌వ‌ర్‌లో ఉంచి  హైకోర్టుకు పంపాల్సిందిగా  విజ‌య‌వాడ సీఎంఎం […]

Advertisement
Update:2015-08-13 18:40 IST
విజ‌య‌వాడ భ‌వానీపురం పోలీస్ స్టేష‌న్లో న‌మోదైన కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్‌డేటాను స‌మ‌ర్పించాల‌ని బీఎస్ఎన్ఎల్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు విజ‌య‌వాడ కోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను నిలిపేయాల‌ని గురువారం హైకోర్టు ఆదేశించింది. విజ‌య‌వాడ సీఎంఎం కోర్టు ఆదేశాల‌పై తెలంగాణ హోంశాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అజ‌య్‌మిశ్రా గురువారం హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేయ‌గా ధ‌ర్మాస‌నం విచారించింది. ఆ మూడు స‌ర్వీస్ ప్రొవైడర్లు స‌మ‌ర్పించిన కాల్‌డేటాను సీల్డ్ క‌వ‌ర్‌లో ఉంచి హైకోర్టుకు పంపాల్సిందిగా విజ‌య‌వాడ సీఎంఎం కోర్టును ఆదేశించింది. ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో త‌దుప‌రి చ‌ర్య‌ల‌న్నీ నిలిపి వేయాల‌ని ఆదేశించింది.
Tags:    
Advertisement

Similar News