తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల హై అలర్ట్!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరో రోజే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించారు. అనుమానం ఉన్న ప్రతీ ప్రాంతాన్నీ పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్‌ నుంచి తీవ్రవాదుల రాకకు అవకాశం ఉందని, అలాగే లష్కర్‌ ఈ తోయిబా తదితర ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేయడంతో రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేశారు. ఈసారి స్వాతంత్ర్య వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించడంతో […]

Advertisement
Update:2015-08-14 06:44 IST
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరో రోజే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించారు. అనుమానం ఉన్న ప్రతీ ప్రాంతాన్నీ పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్‌ నుంచి తీవ్రవాదుల రాకకు అవకాశం ఉందని, అలాగే లష్కర్‌ ఈ తోయిబా తదితర ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలు జారీ చేయడంతో రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేశారు. ఈసారి స్వాతంత్ర్య వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించడంతో తీర ప్రాంతంతోపాటు నగరమంతా గస్తీని ముమ్మరం చేశారు. పోలీసులు అనువణువునా సోదాలు నిర్వహిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్ర దాడులకు అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్‌బ్యూరో చేసిన హెచ్చరికలను ఈసారి పోలీసులు తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలతో ఎక్కడైనా అలసత్వం ప్రదర్విస్తే అపవాదు ఎదుర్కోవలసి వస్తుందన్న భావనతో పోలీసులు ఇరు రాష్ట్రాల్లోను అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్టాలు ఎట్టి పరిస్థితిలోను అలసత్వం ప్రదర్శించవద్దని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సమాచారం అందించింది. ఇటీవల ముంబాయి బాంబు పేలుళ్ళ నిందితుడు యాకుబ్‌ మెమన్‌ను ఉరి తీయడం, ఆ నేపథ్యంలో టైగర్‌ మెమన్‌ కక్ష తీర్చుకుంటానని హెచ్చరించడం తెలిసిందే. మరోవైపు పాక్‌-భారత్‌ సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ప్రతిరోజూ సరిహద్దులోని ఏదో ఒక సెక్టార్‌లో పాక్‌ సేనలు కాల్పులకు దిగడం, దాన్ని ధీటుగా సరిహద్దు భద్రతా దళాలు తిప్పికొట్టడం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అపవాదు మూటగట్టుకోవలసి వస్తుందని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల డీజీపీలను అప్రమత్తం చేయడంతోపాటు వివిధ నగరాల పోలీసు కమిషనర్లను కూడా హెచ్చరించారు. దీంతో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితోపాటు తెలంగాణలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శంషాబాద్‌, విశాఖ విమానాశ్రయాల దగ్గర భద్రతను పెంచారు.
Tags:    
Advertisement

Similar News