చైనాలో భారీ పేలుళ్లు
ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలోని రసాయనిక పదార్థాల గోడౌన్లో బుధవారం అర్థరాత్రి జరిగిన భారీ పేలుడులో 50 మంది మరణించారు. మరో 52 మంది పరిస్థితి విషమంగా ఉంది. 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల తీవ్రతకు గోడౌన్‌కు సమీపంలో ఉన్న వెయ్యి కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ఇళ్ల గోడలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు వెయ్యిమంది అగ్నిమాపక సిబ్బంది, 143 ఫైర్ఇంజన్లతో శ్రమిస్తున్నారు. పేలుళ్ల కారణంగా చైనా సూపర్ కంప్యూటర్ త్యాన్‌హే […]
Advertisement
ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలోని రసాయనిక పదార్థాల గోడౌన్లో బుధవారం అర్థరాత్రి జరిగిన భారీ పేలుడులో 50 మంది మరణించారు. మరో 52 మంది పరిస్థితి విషమంగా ఉంది. 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల తీవ్రతకు గోడౌన్‌కు సమీపంలో ఉన్న వెయ్యి కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు ఇళ్ల గోడలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు వెయ్యిమంది అగ్నిమాపక సిబ్బంది, 143 ఫైర్ఇంజన్లతో శ్రమిస్తున్నారు. పేలుళ్ల కారణంగా చైనా సూపర్ కంప్యూటర్ త్యాన్‌హే -1ఏను అరగంట పాటు షట్ డౌన్ చేసింది.
Advertisement