తెలంగాణ పథకాలకు కిషన్‌రెడ్డి కితాబు!
ఇది విన్న విలేకరులంతా నిజంగా ఆశ్చర్యపోయారు. నిత్యం తెలంగాణ సర్కారు పథకాలు, విధానాలపై ఒంటికాలిపై లేచే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలమూరు పథకాన్ని సమర్థించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఏనాడూ కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కిషన్‌రెడ్డి మెచ్చుకున్న దాఖలాలు లేవు. కనీసం ఓటుకు నోటు కుంభకోణం కేసులోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలవలేదు. తెలుగుదేశంతో ఎంత పొత్తు ఉన్నా సొంత రాష్ట్రంలో విషయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంపై ఆయన తటస్థ […]
Advertisement
ఇది విన్న విలేకరులంతా నిజంగా ఆశ్చర్యపోయారు. నిత్యం తెలంగాణ సర్కారు పథకాలు, విధానాలపై ఒంటికాలిపై లేచే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలమూరు పథకాన్ని సమర్థించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఏనాడూ కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కిషన్‌రెడ్డి మెచ్చుకున్న దాఖలాలు లేవు. కనీసం ఓటుకు నోటు కుంభకోణం కేసులోనూ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలవలేదు. తెలుగుదేశంతో ఎంత పొత్తు ఉన్నా సొంత రాష్ట్రంలో విషయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంపై ఆయన తటస్థ వైఖరికే పరిమితమయ్యారు. ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇంటింటి సర్వే, ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం, పంద్రాగస్టు వేడుకలు, ప్రాణహిత చేవెళ్ల ఇలా ఒకటేంటి ఏ పథకం మొదలుపెట్టినా అందులో లోపాలను మీడియా ముందు ఎత్తి చూపే కిషన్‌రెడ్డి రెండు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలను స్వాగతించారు. మొదటిది తెలంగాణలో గ్రామాలను దత్తత తీసుకునే గ్రామజ్యోతి, రెండోది పాలమూరు ఎత్తిపోతల పథకం. ఈ రెండు మంచి పథకాలని కితాబిచ్చారు. ఇది విన్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తమను తాము గిల్లి చూసుకున్నారంట. ఎప్పుడూ తెలుగుదేశంకు బాసటగా నిలిచే కిషన్‌రెడ్డి తొలిసారిగా పాజిటివ్‌గా మాట్లాడటం వారికి ఒకింత ఆశ్చర్యాన్నే కలిగించింది మరి!
Advertisement