ముంపు మండలాల సమస్యలపై 20న బంద్‌

పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యా, వైద్యం, రవాణ వంటి కనీస ఏర్పాట్లు కూడా ఇంకా చేయలేదని ఆయన అన్నారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని […]

Advertisement
Update:2015-08-12 18:43 IST
పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యా, వైద్యం, రవాణ వంటి కనీస ఏర్పాట్లు కూడా ఇంకా చేయలేదని ఆయన అన్నారు. కనీసం అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ముంపు మండలాల సమస్యలపై ఈనెల 20వ తేదీన బంద్‌ నిర్వహించనున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. వెంటనే ఆర్‌డిఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామాలకూ రెవెన్యూ సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. ముంపునకు గురవుతున్న ఆరు మండలాల పరిధిలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలూ ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారాన్ని డిమాండు చేస్తూ 20న బంద్‌ చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.
Tags:    
Advertisement

Similar News