టీడీపీ నేత‌లు సంస్కార హీనులు: క‌డియం

 తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియ శ్రీ‌హ‌రి తెలుగుదేశం నేత‌ల‌పై విరుచుకుపడ్డారు. బుధ‌వారం ఏర్పాటు చేసిన ఓ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. త‌న కులం గురించి టీడీపీ అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. మనుషులైతే ఒకసారి చెబుతామని, సంస్కార హీనులకు ఏమి చెబుతామని ఆయన అన్నారు. వారి వద్ద ఆరోపణలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్‌ చేశారు. తాను అప్పుడు రాజీనామాకు సిద్దమేనని ఆయన అన్నారు. మల్లుభట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహలు కూడా మాదిగ ఉపకులం వారేనని ఆయన […]

Advertisement
Update:2015-08-13 05:07 IST
తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియ శ్రీ‌హ‌రి తెలుగుదేశం నేత‌ల‌పై విరుచుకుపడ్డారు. బుధ‌వారం ఏర్పాటు చేసిన ఓ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. త‌న కులం గురించి టీడీపీ అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. మనుషులైతే ఒకసారి చెబుతామని, సంస్కార హీనులకు ఏమి చెబుతామని ఆయన అన్నారు. వారి వద్ద ఆరోపణలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్‌ చేశారు. తాను అప్పుడు రాజీనామాకు సిద్దమేనని ఆయన అన్నారు. మల్లుభట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహలు కూడా మాదిగ ఉపకులం వారేనని ఆయన అన్నారు. కాని తెలుగుదేశం నేతలు తనపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకరరావు తీరు బండికింద కుక్క మాదిరిగా ఉందని ఆయన మండిపడ్డారు.
ఈ ఏడాది డీఎస్సీ ఉండ‌దు
ఈ ఏడాది ఉపాధ్యాయ నియామ‌కాలు ఉండ‌వ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ప్ర‌స్తుతం డీఎస్సీ వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. కొన్ని జిల్లాల్లో అవ‌స‌రానికి మించి ఉపాధ్యాయులు ఉండగా,కొన్ని చోట్ల మాత్ర‌మే టీచ‌ర్ల కొర‌త ఉంద‌ని, అది కూడా కేవ‌లం స్కూల్ అసిస్టెంట్లు మాత్ర‌మేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అక్క‌డ విద్యా వ‌లంటీర్లతో స‌రిపెడ‌తామ‌ని చెప్పారు. దీంతో ఉద్యోగ ప్ర‌క‌ట‌న కోసం ఎదురుచూస్తోన్న బీఈడీ, డీఎడ్ అభ్య‌ర్థుల‌పై క‌డియం శ్రీ‌హ‌రి ప్ర‌క‌ట‌న నీళ్లు చ‌ల్లింది. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంతా ఆంగ్ల మాధ్య‌మం వైపు మొగ్గు చూపుతున్నార‌ని అందుకే ఆ దిశ‌గా మోడ‌ల్ స్కూళ్ల నిర్మాణంపై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని వివ‌రించారు. మొత్తానికి క‌డియం ప్ర‌క‌ట‌న బీఈడీ, డీఎడ్ అభ్య‌ర్థుల‌ను నీరు గార్చింది. ఈ ఏడాది కొత్త‌రాష్ట్రంలో కొలువుల జాతర ఉంటుంద‌ని కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగా ఆయాశాఖ‌ల్లో ఖాళీల వివ‌రాలు సైతం వెల్ల‌డించారు. దీంతో బీఈడీ, డీఎడ్ అభ్య‌ర్థుల్లో డీఎస్సీ ఆశ‌లు చిగురించాయి. త‌మ‌కోఒసం డీఎస్సీ వేస్తార‌ని కోటి ఆశ‌ల‌తో ఎదురుచూశారు. చివ‌రికి వారి ఆశ‌లు ఈ ఏడాది కూడా నెర‌వేరేలా లేవు.
Tags:    
Advertisement

Similar News