రోడ్డు మీద చిత్రాలు... అధికారుల పరుగులు
ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావు. అధికారుల దగ్గరికి ఎవరు ఫిర్యాదు తీసుకు వెళ్ళినా అరణ్య రోదనే అవుతుంది. వారికి ఎన్నిసార్లు చెప్పినా కాకిగోల మాదిరిగా పరిగణిస్తారే తప్ప సమస్యను పరిష్కరించరు. అందుకే తమ సమస్యలు చెప్పుకోవడానికి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడో యువకుడు. ప్రజా సమస్యలను గాలికొదిలేసే అధికారుల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదనుకున్నాడా యువకుడు. బెంగుళూరుకు హరిత నగరంగా మంచి పేరుంది. ఆ రాష్ట్రంలో పరిశుభ్రత […]
Advertisement
తొలిసారిగా అతను రహదారుల్లో మూతల్లేకుండా ఉన్న మ్యాన్‌హోల్‌లను లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన కళ్ళారా ఎన్నో సంఘటనలు, దుర్ఘటనలు చూశాడు. దాంతో చలించిపోయిన ఆ యువకుడు స్వతహాగా కళాకారుడు కూడా కావడంతో రెండు చేతుల్ని తయారు చేసి మ్యాన్ హోల్లో పై ఫొటోలో ఉన్నట్టు అమర్చాడు. రెండోసారి తనకు తెలిసిన విద్యతో మ్యాన్‌హోల్‌ను రాక్షస బొమ్మ నోటితో అనుసంధానం చేస్తూ అందరినీ ఆకర్షించాడు. దాంతో అధికారులు ఆగమేఘాల మీద వచ్చి నగరంలో ప్రధాన రహదారుల్లో ఉన్న మ్యాన్‌హోల్స్ అన్నింటిని మూసేశారు. ఆ తర్వాత రోడ్డు మీద పాదచారులకు, వాహనదారులకు సమస్యలు తెచ్చిపెడుతున్న బురదమయమైన ప్రాంతాల్ని లక్ష్యంగా పెట్టుకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో బొమ్మలను రూపొందించాడు. ఒకసారి రోడ్డు మీద మురికిలో మొసలి ఉన్న భ్రమ కల్పించాడు. దాంతో పాదచారులతోపాటు అధికారులు కూడా నిజంగా మొసలే రోడ్డు మీదకు వచ్చేసిందన్న భ్రమలో పడి ఆ తర్వాత ఆశ్చర్యానికి గురయ్యారు. సమస్య పరిష్కారమైంది. ఇపుడు ఇలాంటి ప్రదేశంలోనే అనకొండను ఉంచాడు. అధికారులు పరుగున వచ్చి సమస్య పరిష్కరించారు. ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా సమస్యలను అధికారుల దృష్టికి ఆ యువకుడు తేవడంతో వెనువెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు వారు. బెంగుళూరు నగర వాసులు మాత్రం సమస్య ఉన్నచోటును ఆ యువకుడి దృష్టికి తీసుకువెళుతున్నారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యే స్వచ్ఛంద సంస్థ ‘నమ్మ బెంగుళూరు పౌండేషన్’ (ఎన్‌బీఎఫ్) కార్యకర్తలు ఈ యువకుడికి సహకరిస్తున్నారు.
Advertisement