రూ. 30కే మూడు పెగ్గులు!

తెలంగాణలో ముఫ్ఫై రూపాయలకే మూడు పెగ్గులు! పదిహేనుకు పెగ్గున్నర! రాష్ట్రంలో విక్రయించనున్న చీప్‌ లిక్కర్‌ ధరలు దాదాపు ఇలా ఖరారయ్యాయి. 90 ఎంఎల్‌ ధర రూ.15కు, 180 ఎంఎల్‌ ధరను రూ.30గా ఉంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు సచివాలయంలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో చీప్‌ లిక్కర్‌ ధరలపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సీఎం ఆమోదముద్రతో అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే నూతన ఎక్సైజ్‌ విధానంపై కసరత్తు […]

Advertisement
Update:2015-08-11 18:46 IST
తెలంగాణలో ముఫ్ఫై రూపాయలకే మూడు పెగ్గులు! పదిహేనుకు పెగ్గున్నర! రాష్ట్రంలో విక్రయించనున్న చీప్‌ లిక్కర్‌ ధరలు దాదాపు ఇలా ఖరారయ్యాయి. 90 ఎంఎల్‌ ధర రూ.15కు, 180 ఎంఎల్‌ ధరను రూ.30గా ఉంచాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు సచివాలయంలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో చీప్‌ లిక్కర్‌ ధరలపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సీఎం ఆమోదముద్రతో అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పటికే నూతన ఎక్సైజ్‌ విధానంపై కసరత్తు పూర్తి కావచ్చింది. ఈ పాలసీని కూడా త్వరలో ప్రకటించనున్నారు.
Tags:    
Advertisement

Similar News