గ్రామజ్యోతి ద్వారా పంచాయతీల పరిపుష్టం: సీఎం
పల్లె సీమలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థిక పుష్ఠితో కళకళలాడుతుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే గ్రామాల్లో వెలుతురు నింపేందుకు రూ. 25 కోట్లతో గ్రామజ్యోతిని ప్రారంభించామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన గ్రామజ్యోతి అవగాహనా సదస్సులో అన్నారు. గ్రామాల అభివృద్ధికి నాలుగేళ్ల బృహత్తర పథకాన్ని రూపొందించామని ఆయన అన్నారు. ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత, మౌలిక వసతుల […]
Advertisement
పల్లె సీమలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థిక పుష్ఠితో కళకళలాడుతుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే గ్రామాల్లో వెలుతురు నింపేందుకు రూ. 25 కోట్లతో గ్రామజ్యోతిని ప్రారంభించామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన గ్రామజ్యోతి అవగాహనా సదస్సులో అన్నారు. గ్రామాల అభివృద్ధికి నాలుగేళ్ల బృహత్తర పథకాన్ని రూపొందించామని ఆయన అన్నారు. ప్రతి ఎమ్మెల్యే మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత, మౌలిక వసతుల కల్పన, సహకార, వ్యవసాయ, పాడి రంగాల అభివృద్ధి గ్రామజ్యోతి ప్రధాన లక్ష్యాలని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు గ్రామజ్యోతి ద్వారా పూర్వ వైభవం తెస్తామని ఆయన అన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కలిసి గ్రామ ప్రణాళికను తయారు చేయాలి. గ్రామ అవసరాలను గుర్తించి, నిధుపై అంచనా వేసుకుని ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమాన భాగస్వామ్యంతోనే గ్రామజ్యోతి విజయవంతమవుతుందని ఆయన అన్నారు.
పేదల డబుల్ బెడ్‌రూంపై ఆగస్టు 15న ప్రకటన
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించిన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై స్వాతంత్ర దినోత్సవ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. పేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డబుల్‌బెడ్ రూము ఇళ్లపై ఆగస్టు 15న గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తు పూర్తి చేసిందని వారు తెలిపారు. పేదల డబుల్ బెడ్ రూమ్ పథకానికి చైర్మన్లుగా జిల్లా కలెక్టర్లను నియమించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించాలని నిర్ణయించింది. అయితే ఆ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. దీనిపై ఒక స్పష్టత తెచ్చేందుకు సీఎం ప్రకటన చేస్తారని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సీఎం విధివిధానాలు ప్రకటించిన వెంటనే పేదల డబుల్ రూమ్ ఇళ్ల పనుల నిర్మాణం ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.
Advertisement