ఎస్సీ రుణాలపై కొత్త విధానం
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ రుణాల మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎస్పీ కార్పోరేషన్ ద్వారా ఇకపై అందించే రుణాలపై గరిష్ట రాయితీని అరవై నుంచి 80 శాతానికి పెంచింది. రూ. లక్ష లోపు రుణం తీసుకునే లబ్ధిదారులకు 80 శాతం, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 70 శాతం, రూ. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణంపై 60శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు వ్యక్తిగతంగా అందచేసే రుణాల […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ రుణాల మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎస్పీ కార్పోరేషన్ ద్వారా ఇకపై అందించే రుణాలపై గరిష్ట రాయితీని అరవై నుంచి 80 శాతానికి పెంచింది. రూ. లక్ష లోపు రుణం తీసుకునే లబ్ధిదారులకు 80 శాతం, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 70 శాతం, రూ. 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణంపై 60శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతోపాటు వ్యక్తిగతంగా అందచేసే రుణాల గరిష్ట పరిమితిని రూ. 10లక్షలకు పెంచింది. కొత్త రుణ రాయితీ విధాన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేయడంతో, త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.
Advertisement