రైతు ఆత్మహత్యలపై మౌనం వీడాలి
మోడీకి సీపీఎం హితవు రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం నిలదీసింది. నరేంద్ర మోడీ గద్దెనెక్కిన తరువాత దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. అఖిలభారత కిసాన్‌సభ రెండు రోజులపాటు న్యూఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అధ్యక్షతన జరిగిన కార్యాక్రమంలో కరత్ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వానికి రైతులంటే […]
Advertisement
మోడీకి సీపీఎం హితవు
రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం నిలదీసింది. నరేంద్ర మోడీ గద్దెనెక్కిన తరువాత దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. అఖిలభారత కిసాన్‌సభ రెండు రోజులపాటు న్యూఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా అధ్యక్షతన జరిగిన కార్యాక్రమంలో కరత్ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వానికి రైతులంటే అంత చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా పొందుపరిచారని, అయితే ఆ విషయాన్ని మోడీ సర్కార్ పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విధానాలను అవలంబించి రైతులను మరణాలకు మోడీ కారకులౌతున్నారని కరత్ విమర్శించారు. ప్రభుత్వ ఉదారవిధానాల విధానాల వల్లే రైతులు అప్పుల ఉబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల గోడును వినేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపక పోగా, రైతు ఆత్మహత్యలపై చౌకబారు, నీతి మాలిన వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలపై మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని హితవు పలికారు. రైతుల పెట్టుబడికి 50 శాతం పెంచి మద్ధతు ధర ప్రకటించాలని డిమాండు చేశారు. రైతుల ఆత్మహత్యలపై వారి కుటుంబాలతో కిసాన్ సభ చేస్తున్న ఆందోళన దేశ చరిత్రలోనే అరుదైన అంశమని, అది చిరస్థాయిగా నిలిచిపోతుందని కరత్ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల సభ్యులను కలుసుకొని వారి బాధలను తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారిని ఓదార్చారు. ఈ సందర్భంలో ఆ రైతు కుటుంబాలు తమ గోడును కరత్‌కు, ఇతర నేతలకు వివరిస్తూ కన్నీటి పర్వంతమయ్యారు.
Advertisement