కాల్ డ్రాపింగ్ సమస్యపై ఎయిర్‌టెల్‌కు రూ. పదికోట్ల జరిమానా
కాల్‌డ్రాపింగ్ సమస్యతో ఫోన్ బిల్లులు తడిచి మోపెడు కావడంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. ఈ సమస్య వల్ల వందల్లో వచ్చే బిల్లులు వేలల్లో వస్తున్నాయి. ఒక వ్యక్తి ఇతరులకు డయల్ చేసినప్పుడు కాల్ మళ్లీ మళ్లీ కట్ అయితే దాన్ని కాల్ డ్రాపింగ్ అంటారు. ఈ సమస్య వల్ల 30 పైసలు చెల్లించే బిల్లుకు నాలుగింతలు రెట్టింపు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన టెలికాం సంస్థ ఎయిర్ టెల్ నెట్‌వర్క్‌లోనే అత్యధికంగా కాల్ […]
Advertisement
కాల్‌డ్రాపింగ్ సమస్యతో ఫోన్ బిల్లులు తడిచి మోపెడు కావడంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. ఈ సమస్య వల్ల వందల్లో వచ్చే బిల్లులు వేలల్లో వస్తున్నాయి. ఒక వ్యక్తి ఇతరులకు డయల్ చేసినప్పుడు కాల్ మళ్లీ మళ్లీ కట్ అయితే దాన్ని కాల్ డ్రాపింగ్ అంటారు. ఈ సమస్య వల్ల 30 పైసలు చెల్లించే బిల్లుకు నాలుగింతలు రెట్టింపు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన టెలికాం సంస్థ ఎయిర్ టెల్ నెట్‌వర్క్‌లోనే అత్యధికంగా కాల్ డ్రాపింగ్ సమస్య ఉందని గుర్తించింది. దీంతో ఎయిర్‌టెల్ సంస్థకు రూ. పదికోట్ల జరిమానాను విధించింది.
Advertisement