అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు శుభవార్త... త్వరలో చెల్లింపులు

అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త. రెండు మూడు నెలల్లో డిపాజిటర్లందరికీ వారి వారి మొత్తాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించే దిశగా ఏపీ అడుగులేస్తోంది. తాజాగా సీజ్ చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చే డబ్బుతో అగ్రిగోల్డ్ ఖాతాదారులకి సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఆర్థిక నేరాల అధ్యయన కమిటీ చైర్మన్ కె.నర్సింహమూర్తి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల […]

Advertisement
Update:2015-08-11 07:42 IST
అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త. రెండు మూడు నెలల్లో డిపాజిటర్లందరికీ వారి వారి మొత్తాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించే దిశగా ఏపీ అడుగులేస్తోంది. తాజాగా సీజ్ చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఆస్తుల వేలం ద్వారా వచ్చే డబ్బుతో అగ్రిగోల్డ్ ఖాతాదారులకి సొమ్ము చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. ఆర్థిక నేరాల అధ్యయన కమిటీ చైర్మన్ కె.నర్సింహమూర్తి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించిన నివేదికను సీఎంకు అందజేసినట్లు తెలిపారు. క్యాష్‌ మేనేజ్‌మెంట్‌పై అవగాహన లేక అగ్రిగోల్డ్‌ దివాలా తీసిందని, రెండు, మూడు నెలల్లో అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లందరికీ చెల్లింపులు పూర్తి చేస్తామని, ముందుగా 5300 మంది డిపాజిటర్లకు చెల్లింపులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 32 లక్షల మంది డిపాజిటర్లకు రూ.6800 కోట్లు చెల్లించాల్సి ఉందని, అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ 7 వేల కోట్లు ఉన్నందున ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. పారదర్శకంగా ఈ- వేలం నిర్వహిస్తామని, ఆస్తుల మదింపు చేయడం వల్ల వాస్తవ పరిస్థితి తెలిసిందని, వాస్తవానికి సీజ్‌ చేసిన ఆస్తుల విలువ కన్నా అగ్రిగోల్డ్‌కు ఉన్న అప్పులు తక్కువేనని, అందుచేత డిపాజిటర్లు భయపడాల్సిన పని లేదని అగ్రిగోల్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ కుటుంబరావు అన్నారు. ముందుగా ఐదు వేలు, పది వేలు, ఇరవై వేల రూపాయల డిపాజిటర్ల కేసులు పరిష్కరిస్తామని, ఆ తర్వాత మిగిలిన డిపాజిటర్ల వ్యవహారాలు చక్కదిద్దుతామని ఆయన చెప్పారు.
Tags:    
Advertisement

Similar News