నేతలు మారినా మారని పాతబస్తీ తలరాత
ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం .. ఏదైనా సరే ముఖ్యమంత్రులు ఎంత మంది మారినా పాతబస్తీ వాసుల తలరాత మాత్రం మారడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తానని, పాతబస్తీ పేద ప్రజలకు డబుల్ బెడ్ రూము ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఓపెన్ నాలాలు, మూసీ కాలువలపై పైకప్పు వేస్తామని హామీ ఇచ్చారు. అయితే, […]
Advertisement
ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం .. ఏదైనా సరే ముఖ్యమంత్రులు ఎంత మంది మారినా పాతబస్తీ వాసుల తలరాత మాత్రం మారడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మిస్తానని, పాతబస్తీ పేద ప్రజలకు డబుల్ బెడ్ రూము ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఓపెన్ నాలాలు, మూసీ కాలువలపై పైకప్పు వేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం తహసీల్దార్ల కార్యాలయం చుట్టు తిరుగుతూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాతబస్తీ పరిస్థితులు చూసి చలించి పోయి రూ. 200 కోట్లు మంజూరు చేశారు. అయితే, ఆ నిధులు ఏమయ్యాయో, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. ప్రస్తుత ప్రభుత్వమన్నా పాతబస్తీ అభివృద్దికి కృషి చేయాలని బస్తీ వాసులు కోరుతున్నారు.
Advertisement