రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
ప్రభుత్వం అనుసరించిన రైతాంగం వ్యతిరేక విధానం వల్లనే తాము ఆప్తులను కోల్పోయామని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. రుణాలు మాఫీ చేయక పోవడం,పంటలకు మద్దతు ధర పెంచక పోవడం వల్లనే చేతికొచ్చిన పంటతో వడ్డీ వ్యాపారుల అప్పులు తీర్చలేక అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘం తరపున సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల ధర్నా […]
Advertisement
ప్రభుత్వం అనుసరించిన రైతాంగం వ్యతిరేక విధానం వల్లనే తాము ఆప్తులను కోల్పోయామని ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. రుణాలు మాఫీ చేయక పోవడం,పంటలకు మద్దతు ధర పెంచక పోవడం వల్లనే చేతికొచ్చిన పంటతో వడ్డీ వ్యాపారుల అప్పులు తీర్చలేక అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘం తరపున సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల ధర్నా ప్రారంభమైంది. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి ధర్నాకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో పలువురు వామపక్షనేతలు సంఘీభావం ప్రకటించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ప్రముఖ జర్నలిస్ట్, సామాజికవేత్త పాలగుమ్మి సాయినాధ్ ఆరోపించారు.
Advertisement