పాలమూరు బీడు భూముల్లో వజ్రాల గనులు
ఆకలి మంటలకు, బీదరికానికి, వలసలకు కేరాఫ్ అడ్రస్ పాలమూరు. అయితే ఇకపై పాలమూరుకు ఈ నినాదం వర్తించదు. రాబోయే రోజుల్లో వజ్రాల గనులకు పాలమూరు కేంద్ర బిందువు కానుందని పరిశోధకులు అంటున్నారు. పాలమూరు బీడుభూముల్లో అపారమైన వజ్రాల నిల్వలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మరింత పరిశోధన జరిపితే వజ్రాలను వెలికి తీయవచ్చని వారు అంటున్నారు. ఒకప్పటి గోల్కొండ సామ్రాజ్యం కోహినూరు, హోప్ డైమండ్ వంటి అపురూపమైన వజ్రాలతో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. గోల్కొండకు సమీపంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో […]
Advertisement
ఆకలి మంటలకు, బీదరికానికి, వలసలకు కేరాఫ్ అడ్రస్ పాలమూరు. అయితే ఇకపై పాలమూరుకు ఈ నినాదం వర్తించదు. రాబోయే రోజుల్లో వజ్రాల గనులకు పాలమూరు కేంద్ర బిందువు కానుందని పరిశోధకులు అంటున్నారు. పాలమూరు బీడుభూముల్లో అపారమైన వజ్రాల నిల్వలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మరింత పరిశోధన జరిపితే వజ్రాలను వెలికి తీయవచ్చని వారు అంటున్నారు. ఒకప్పటి గోల్కొండ సామ్రాజ్యం కోహినూరు, హోప్ డైమండ్ వంటి అపురూపమైన వజ్రాలతో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. గోల్కొండకు సమీపంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో వజ్రాల నిక్షేపాలు ఇప్పటికీ విస్తారంగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసరు జీ రాందాస్ అంటున్నారు. ఆయన బృందం మహబూబ్‌నగర్లో పరిశోధనలు చేస్తోంది. పాలమూరుతో పాటు కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్ పరిధిలోని గ్రామాల్లో కనీసం రెండు డజన్ల వజ్రాల జోన్లను గుర్తించామని, మహబూబ్‌నగర్ , రాయచూర్ రోడ్డు మార్గంలో వజ్రాలు లభించడానికి ఆస్కారమున్న ప్రాంతాలు గుర్తించామని ఆయన తెలిపారు. వీటితో పాటు నారాయణ్‌పేట్, గుర్మిట్కల్, అమ్మిరెడ్డిపల్లె, దామరిగిద్ద, నిడుగుర్తి గ్రామాల్లో వజ్రాల నిక్షేపాలున్నాయని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా చండూరులోనూ వజ్రాలు, బంగారం నిక్షేపాలున్నట్లు ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలపై ఎన్నోసార్లు పరిశోధనలు జరిగినా, వజ్రాలున్న 21 జోన్లను గుర్తించడం ఇదే ప్రధమం. ఇక్కడ వజ్రాలు వి ఆకారంలోనూ, క్యారట్ ఆకారంలోనూ ఉన్నాయని రాందాస్ చెప్పారు.
Advertisement