అమ్మ కరుణించలేదని.. దేవతకు వినతిపత్రం..
తమిళనాడులో సంపూర్ణ మద్యం నిషేధం విధించాలంటూ పోరాటబాట పట్టిన ఆందోళనకారులు అమ్మ (సీఎం జయలలిత) తమను పట్టించుకోవడం లేదని, తాము ఇచ్చే వినతిపత్రం కూడా స్వీకరించడం లేదని ఆరోపిస్తూ వింత పద్ధతిని అనుసరించారు. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమపై ముఖ్యమంత్రి జయలలిత దయ చూపడం లేదంటూ కంభం ప్రాంత ప్రజలు ఆలయానికి వెళ్లి దేవతకు వినతిపత్రం సమర్పించారు. జయ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వేడుకున్నారు. కంభంలో మద్యం దుకాణాన్ని మూసి వేయాలని కోరుతూ ఇండియా జననాయక పార్టీ […]
Advertisement
తమిళనాడులో సంపూర్ణ మద్యం నిషేధం విధించాలంటూ పోరాటబాట పట్టిన ఆందోళనకారులు అమ్మ (సీఎం జయలలిత) తమను పట్టించుకోవడం లేదని, తాము ఇచ్చే వినతిపత్రం కూడా స్వీకరించడం లేదని ఆరోపిస్తూ వింత పద్ధతిని అనుసరించారు. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తమపై ముఖ్యమంత్రి జయలలిత దయ చూపడం లేదంటూ కంభం ప్రాంత ప్రజలు ఆలయానికి వెళ్లి దేవతకు వినతిపత్రం సమర్పించారు. జయ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వేడుకున్నారు. కంభంలో మద్యం దుకాణాన్ని మూసి వేయాలని కోరుతూ ఇండియా జననాయక పార్టీ పిలుపునిచ్చింది. “రాష్ట్రాన్ని పాలించే అమ్మ ఇంకా మద్య నిషేధంపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. లోకాన్ని ఏలే నీవైనా దయచూపమ్మా” అంటూ వినతిపత్రాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి వారు ప్రార్ధించారు.
Advertisement