భువనగిరిలో పర్వతారోహణ స్కూలు: పేర్వారం
తెలంగాణలోని పర్యాటకప్రాంతాలను ఆంధ్రాపాలకులు తొక్కిపెట్టారని, స్వరాష్ట్రంలో వాటిని వెలుగులోకి తెస్తున్నామని పర్యాటకశాఖ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరిలో 850 అడుగుల ఎత్తులో ఏకశిల పర్వతం ఉందన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరి గుట్ట సైతం ఏకశిల పర్వతంమాదిరిగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో పర్వతరోహణ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పర్యాటక కేంద్రాలను గుర్తించి వాటిని ఇప్పుడిప్పుడే […]
Advertisement
తెలంగాణలోని పర్యాటకప్రాంతాలను ఆంధ్రాపాలకులు తొక్కిపెట్టారని, స్వరాష్ట్రంలో వాటిని వెలుగులోకి తెస్తున్నామని పర్యాటకశాఖ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరిలో 850 అడుగుల ఎత్తులో ఏకశిల పర్వతం ఉందన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరి గుట్ట సైతం ఏకశిల పర్వతంమాదిరిగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో పర్వతరోహణ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో పర్యాటక కేంద్రాలను గుర్తించి వాటిని ఇప్పుడిప్పుడే వెలుగులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లాలోని రేగొండ ప్రాంతంలో సొరంగమార్గాలు బయటపడ్డాయన్నారు. కేంద్ర టూరిజంశాఖకు చెందిన మణిశర్మతో రాష్ట్రంలోని చారిత్రక సంపదను గురించి వివరించినట్లు తెలిపారు.
Advertisement