అబ్దుల్ కలాం ట్రాన్సెండెన్స్ పుస్తకం విడుదల
మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం భారతదేశం గర్వించదగ్గ వ్యక్తని ప్రముఖలు కొనియాడారు. కలాం విశ్వశాంతిని కాంక్షించడంతోపాటు పట్టణాలతో సమానంగా పల్లెలు ప్రగతి సాధించాలని కోరుకున్నారని అన్నారు. స్వామి నారాయణ్ మందిర్ ఆధ్వర్యంలో కలాం రచించిన ట్రాన్సెండెన్స్ పుస్తకాన్ని ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మాట్లాడుతూ కలాం దేశానికి లభించిన జాతిరత్నమని కొనియాడారు. అబ్దుల్ కలాం అత్యంత స్నేహశీలి, ప్రజా రాష్ట్రపతని బ్రహ్మవిహారీ స్వామీజీ […]
Advertisement
మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం భారతదేశం గర్వించదగ్గ వ్యక్తని ప్రముఖలు కొనియాడారు. కలాం విశ్వశాంతిని కాంక్షించడంతోపాటు పట్టణాలతో సమానంగా పల్లెలు ప్రగతి సాధించాలని కోరుకున్నారని అన్నారు. స్వామి నారాయణ్ మందిర్ ఆధ్వర్యంలో కలాం రచించిన ట్రాన్సెండెన్స్ పుస్తకాన్ని ఆదివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మాట్లాడుతూ కలాం దేశానికి లభించిన జాతిరత్నమని కొనియాడారు. అబ్దుల్ కలాం అత్యంత స్నేహశీలి, ప్రజా రాష్ట్రపతని బ్రహ్మవిహారీ స్వామీజీ శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో పుస్తక సహ రచయిత ఆచార్య అరుణ్ తివారీతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement