జగన్ దీక్షతో జనమయమైన జంతర్‌మంతర్!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి తలపెట్టిన మహా ధర్నా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. అంతకుముందు కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం మాట మార్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి తలపెట్టిన మహా ధర్నా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. అంతకుముందు కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్ర ప్రభుత్వం మాట మార్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి నివాళులర్పించిన అనంతరం ఆయన ఉదయం 11 గంటల సమయంలో దీక్షకు శ్రీకారం చుట్టారు. జగన్ దీక్ష శిబిరానికి చేరే సరికే పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జంతర్ మంతర్ ప్రాంతమంతా జన సందోహంతో నిండిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్టీ నాయకులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ… చేస్తున్న నినాదాల మధ్య జగన్ తన దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతుంది. అనంతరం పార్లమెంటు వరకు భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించనున్నట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి.
Advertisement