టెలీకాం ఆపరేటర్లపై 10.8 కోట్ల జరిమానా
దేశంలోని టెలీకాం ఆపరేటర్లపై కేంద్ర ప్రభుత్వం 10.8 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయంను కేంద్ర టెలీకాం శాఖ మంత్రి రవీ శంకర్ ప్రసాద్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2015 -16 సంవత్సరంకు గాను టెలీకాం ఆపరేటర్లకు ఈ పెనాలీటీని విధించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 2.15 కోట్లు, వోడా ఫోన్‌కు 1.8 కోట్లు, రిలయన్స్‌కు రూ. 1.65 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌కు రూ. […]
Advertisement
దేశంలోని టెలీకాం ఆపరేటర్లపై కేంద్ర ప్రభుత్వం 10.8 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయంను కేంద్ర టెలీకాం శాఖ మంత్రి రవీ శంకర్ ప్రసాద్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2015 -16 సంవత్సరంకు గాను టెలీకాం ఆపరేటర్లకు ఈ పెనాలీటీని విధించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 2.15 కోట్లు, వోడా ఫోన్‌కు 1.8 కోట్లు, రిలయన్స్‌కు రూ. 1.65 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌కు రూ. 1.45 కోట్లు మొత్తంతో అత్యధిక జరిమానా విధించారు. ఇక ఐడియాకు రూ. 95లక్షలు, ఎయిర్‌సెల్‌కు 90 లక్షలు, బిఎస్‌ఎన్‌ఎల్‌కు 70 లక్షలు, లూప్‌కు 55 లక్షలు, యూనినర్‌కు 35 లక్షలు, ఎంటిఎన్‌ఎల్‌కు 15 లక్షలు, వీడియోకాన్‌కు 10 లక్షల రూపాయలు జరిమానా విధించినట్టు మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
Advertisement