తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ రద్దు
బేవరెజెస్ కార్పోరేషన్ ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పన్నుల నుంచి ఉపశమనం కోసం ఏపీ తరహాలో బేవరేజెస్‌ను రద్దు చేయాలని శుక్రవారం జరిగిన సీఎస్ రాజీవ్ శర్మ, ఎక్సైజ్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతోనూ ఆదాయపు పన్ను శాఖతోనూ తలనొప్పులుండవని అధికారులు భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ రూ. 1,274 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతా […]
Advertisement
బేవరెజెస్ కార్పోరేషన్ ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర పన్నుల నుంచి ఉపశమనం కోసం ఏపీ తరహాలో బేవరేజెస్‌ను రద్దు చేయాలని శుక్రవారం జరిగిన సీఎస్ రాజీవ్ శర్మ, ఎక్సైజ్, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతోనూ ఆదాయపు పన్ను శాఖతోనూ తలనొప్పులుండవని అధికారులు భావిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ రూ. 1,274 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి తమ ఖాతాలోకి మళ్లించుకున్న తర్వాత టీ. సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement