జగన్‌కు క్రెడిట్ దక్కకుండా.... బాబు ఎల్లో మాస్టర్‌ప్లాన్
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత 10న ఢిల్లీలో ధర్నా చేస్తుండడంతో ఇపుడు రాష్ట్రంలో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వామపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తోంది. అందులో ప్రధానపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినాయకుడు జగన్‌కు ప్రజల సానుభూతి, మద్దతు లభించే అవకాశం ఉండడంతో చంద్రబాబు నాయుడు హడావిడిగా నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం తాము కేంద్రంపై వత్తిడి […]
Advertisement
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షనేత, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత 10న ఢిల్లీలో ధర్నా చేస్తుండడంతో ఇపుడు రాష్ట్రంలో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వామపక్షాలు ఆందోళనను ఉధృతం చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తోంది. అందులో ప్రధానపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినాయకుడు జగన్‌కు ప్రజల సానుభూతి, మద్దతు లభించే అవకాశం ఉండడంతో చంద్రబాబు నాయుడు హడావిడిగా నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక హోదా కోసం తాము కేంద్రంపై వత్తిడి చేయడం లేదన్న భావన ప్రజల్లోకి బాగా వెళ్లిపోయిందన్న విషయాన్ని తమ పార్టీ అధినాయకుడు ఇప్పటికి గుర్తించారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువచ్చారని సమాచారం. అందుకే చంద్రబాబు వెంటనే చర్యలు ప్రారంభించారు. అనుకూల మీడియాలో ఇప్పటికే కథనాలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారంటూ కథనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు ప్రయత్నాల వల్లే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇవ్వబోతున్నారని ఓ కథనం చంద్రబాబు అనుకూల పత్రికలో వచ్చింది. ఈనెలలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని, త్వరలోనే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించేలా ఒప్పిస్తారని, ఆ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక హోదాపై హామీ ఇస్తారని ఆ కథనం సారాంశం. హామీలకేం.. ఇప్పటికే బోలెడున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావలసింది ప్రత్యేక హోదా. అది కూడా వెంటనే అమల్లోకి వస్తేనే రాష్ట్రం కాస్తయినా ఆర్థికంగా పుంజుకుంటుంది.
Advertisement