పోలీస్ శాఖలోనూ వయో పరిమితి సడలింపు
యూనిఫాం సర్వీసులకు కూడా గరిష్ట వయో పరిమితిని మూడు నుంచి ఐదేళ్లకు సడలించాలని తెలంగాణ ్రభుత్వం నిర్ణయించింది. అందుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిందని, ముఖ్యమంత్రి ఆమోద ముద్ర పడగానే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కనుక సాధ్యమైనంత […]
Advertisement
యూనిఫాం సర్వీసులకు కూడా గరిష్ట వయో పరిమితిని మూడు నుంచి ఐదేళ్లకు సడలించాలని తెలంగాణ ్రభుత్వం నిర్ణయించింది. అందుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించిందని, ముఖ్యమంత్రి ఆమోద ముద్ర పడగానే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కనుక సాధ్యమైనంత ఎక్కువ మంది ఉద్యోగావకాశాలు కల్పించాలని అందుకోసం యూనిఫాం సర్వీసులకు కూడా వయోపరిమితిని సడలించాలని నిర్ణయించింది. పోలీస్ పరీక్షల్లో 5 కిమీ పరుగు పందాన్ని రద్దు చేసింది. ఉగ్రవాదుల, నక్సల్స్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారికి రెట్టింపు పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించింది.
Advertisement