రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
బీహార్, హిమాచలప్రదేశ్ లకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. బీజేపీ సీనియర్ నేత రామ్‌నాధ్ కోవింద్‌ను బీహార్‌కు, ఆచార్య దేవ్‌వ్రత్‌ను హిమాచల ప్రదేశ్‌కు గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేసారు. వారిద్దరూ కొత్త గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, బీహార్ లో తనను సంప్రదించకుండా కొత్త గవర్నర్‌ను నియమించడం పట్ల ఆ […]
Advertisement
బీహార్, హిమాచలప్రదేశ్ లకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. బీజేపీ సీనియర్ నేత రామ్‌నాధ్ కోవింద్‌ను బీహార్‌కు, ఆచార్య దేవ్‌వ్రత్‌ను హిమాచల ప్రదేశ్‌కు గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేసారు. వారిద్దరూ కొత్త గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, బీహార్ లో తనను సంప్రదించకుండా కొత్త గవర్నర్‌ను నియమించడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం కొత్త గవర్నర్ నియామకానికి ముందు కేంద్రం కానీ, హోం శాఖ కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందని ఆయన అన్నారు.
Advertisement