శ్రీవారి బంగారంపై ఏడాది వ‌డ్డీ  80 కిలోలు

ఏడుకొండ‌ల వాడు తాను తీసుకున్న అప్పుకు కుబేరుడుకు వ‌డ్డీ ఎంత చెల్లిస్తాడో కానీ, భూలోకంలోని శ్రీ‌వారి సంప‌ద‌కు మాత్రం వ‌డ్డీ ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ల‌భిస్తోంది. టీటీడీ అధికారులు శ్రీవారి బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, కార్పోరేష‌న్ బ్యాంక్‌, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 4.5 ట‌న్నుల బంగారాన్ని డిపాజిట్ చేసిన‌ట్లు టీటీడీ ఈవో సాంబశివ‌రావు వెల్ల‌డించారు. అది కాకుండా మ‌రో ట‌న్ను బంగారాన్ని ఎస్‌బీఐలో డిపాజిట్ చేయ‌నున్నారు. దీంతో వ‌డ్డీకాసుల […]

Advertisement
Update:2015-08-08 18:44 IST
ఏడుకొండ‌ల వాడు తాను తీసుకున్న అప్పుకు కుబేరుడుకు వ‌డ్డీ ఎంత చెల్లిస్తాడో కానీ, భూలోకంలోని శ్రీ‌వారి సంప‌ద‌కు మాత్రం వ‌డ్డీ ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ల‌భిస్తోంది. టీటీడీ అధికారులు శ్రీవారి బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, కార్పోరేష‌న్ బ్యాంక్‌, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంకుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 4.5 ట‌న్నుల బంగారాన్ని డిపాజిట్ చేసిన‌ట్లు టీటీడీ ఈవో సాంబశివ‌రావు వెల్ల‌డించారు. అది కాకుండా మ‌రో ట‌న్ను బంగారాన్ని ఎస్‌బీఐలో డిపాజిట్ చేయ‌నున్నారు. దీంతో వ‌డ్డీకాసుల వాడి బంగారం 5,500 కిలోల‌కు చేర‌నుంది. దాని విలువ రూ.1,320 కోట్లు. ఈ బంగారం డిపాజిట్‌పై శ్రీ‌వారికి ఏడాదికి 80 కిలోల బంగారం వ‌డ్డీగా ల‌భిస్తుంద‌ని టీటీడీ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    
Advertisement

Similar News