జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు
రాబోయే నాలుగేళ్లలో ప్రతి జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ శనివారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ప్రకటించారు. రాష్ట్రంలోని 8,700 పంచాయతీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంప్‌యార్డును నిర్మిస్తామని ఆయన చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను పరిశీలించిన […]
Advertisement
రాబోయే నాలుగేళ్లలో ప్రతి జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ శనివారం కరీంనగర్ జిల్లా పర్యటనలో ప్రకటించారు. రాష్ట్రంలోని 8,700 పంచాయతీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంప్‌యార్డును నిర్మిస్తామని ఆయన చెప్పారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను పరిశీలించిన అనంతరం మహాసముద్రం గండిలోని బహిరంగసభలో ప్రసంగించారు , ఎంపి, ఎమ్మెల్సీ నిధులతో ఊర్లను అద్దాల్లాగా మారుస్తామని, ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తామని, డబుల్ బెడ్‌రూమ్ పథకాన్నిదశల వారీగా అమలు చేస్తామని ఆయన చెప్పారు.
Advertisement