ఉద్యోగాలపై చంద్రబాబు తూచ్!
ఇంటికో ఉద్యోగం… ఉద్యోగం ఇచ్చే వరకు నెలనెలా రు.2వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను బుట్టలో వేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు. ఊరూరా తిరిగి మరీ ఆయన ఊదరగొట్టారు. పేపర్లలోనూ, టీవీలలోనూ ప్రకటనలతో హోరెత్తించారు. ఇంకేముంది.. అనుభవజ్ఞుడు చంద్రబాబు.. ఆకాశాన్ని నేలకు దించేస్తాడు అని అన్నివర్గాల లాగానే నిరుద్యోగులైన యువత కూడా నమ్మేసింది. ఇపుడు చంద్రబాబు అసలు రంగు బైటపడింది. ఆయన నయవంచన కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు […]
Advertisement
ఇంటికో ఉద్యోగం… ఉద్యోగం ఇచ్చే వరకు నెలనెలా రు.2వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను బుట్టలో వేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు. ఊరూరా తిరిగి మరీ ఆయన ఊదరగొట్టారు. పేపర్లలోనూ, టీవీలలోనూ ప్రకటనలతో హోరెత్తించారు. ఇంకేముంది.. అనుభవజ్ఞుడు చంద్రబాబు.. ఆకాశాన్ని నేలకు దించేస్తాడు అని అన్నివర్గాల లాగానే నిరుద్యోగులైన యువత కూడా నమ్మేసింది. ఇపుడు చంద్రబాబు అసలు రంగు బైటపడింది. ఆయన నయవంచన కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్రం లోటులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేమని చంద్రబాబు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు విలేకరులకు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేమని, ప్రయివేటు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు చెప్పారట. ప్రయివేటు ఉద్యోగాలంటే బట్టలకొట్టులో గుమాస్తా ఉద్యోగం… హోటళ్లలో బిల్లులు రాసే ఉద్యోగం.. వంటివన్న మాట. అవి మేం సంపాదించుకోలేమా..? దాని కోసం ప్రభుత్వం ఎందుకు దండగ అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అసలు లోటు బడ్జెట్ ఉన్నపుడు ప్రత్యేక విమానాలలో విదేశాలకు తిరగడం ఎందుకు? వందల కోట్లు దుబారా ఖర్చుపెట్టి సొంత కార్యాలయాలకు అనవసర సొబగులెందుకు? కాన్వాయ్‌లో వాహనాలకే కోట్ల రూపాయల దుర్వినియోగం ఎందుకు? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వీటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. ఖాళీల భర్తీ కోరుతూ కోర్టులో కేసులు వేశామని, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని అయినా ఈ సీఎం పట్టించుకోవడం లేదని గోవిందరావు తెలిపారు. మరోవైపు ఆంధ్రా మేధావుల ఫోరం కూడా ఉద్యోగ ఖాళీలపై స్పందించింది. ఖాళీ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Advertisement