అధ్యయనం తర్వాతే కూల్చివేతపై నిర్ణయం: తలసాని
ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. ఆస్పత్రిని సందర్శించిన వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ మాట్లాడుతూ, నిపుణులతో అధ్యయనం జరిపిన తర్వాతే ఉస్మానియా కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు ఆస్పత్రిని నిర్లక్ష్యం చేయడం వల్లనే భవనం శిథిలావస్థకు చేరుకుందని, అయితే కూల్చివేతపై నిపుణులతో సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేసి కొత్త […]
Advertisement
ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతపై ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. ఆస్పత్రిని సందర్శించిన వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ మాట్లాడుతూ, నిపుణులతో అధ్యయనం జరిపిన తర్వాతే ఉస్మానియా కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు ఆస్పత్రిని నిర్లక్ష్యం చేయడం వల్లనే భవనం శిథిలావస్థకు చేరుకుందని, అయితే కూల్చివేతపై నిపుణులతో సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మిస్తామని గతంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై స్థానిక వైద్యులు, వైద్యసిబ్బంది, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఆస్పత్రిని కూలిస్తే ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
Advertisement