యాకుబ్ మెమన్ జడ్జి మిశ్రాకు బెదిరింపు లేఖ
ఉరి శిక్ష అమలును నిలిపి వేయాలంటూ శిక్ష అమలుకు ముందు చివరిసారిగా యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను, క్షమాబిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ లేఖపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎంత భద్రత ఏర్పాటు చేసుకున్నా చావు నుంచి తప్పించుకోలేవంటూ ఆ లేఖలో అగంతకుడు బెదిరించాడు. కాగా ఉరి శిక్ష అమలు జరపడానికి ఓ గంటన్నర ముందు మెమన్ సోదరుడు […]
Advertisement
ఉరి శిక్ష అమలును నిలిపి వేయాలంటూ శిక్ష అమలుకు ముందు చివరిసారిగా యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను, క్షమాబిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రాకు బెదిరింపు లేఖ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ లేఖపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎంత భద్రత ఏర్పాటు చేసుకున్నా చావు నుంచి తప్పించుకోలేవంటూ ఆ లేఖలో అగంతకుడు బెదిరించాడు. కాగా ఉరి శిక్ష అమలు జరపడానికి ఓ గంటన్నర ముందు మెమన్ సోదరుడు టైగర్ మెమన్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. యాకుబ్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని టైగర్ తన సంభాషణల్లో కుటుంబ సభ్యులతో అన్నట్టు పోలీసులు గుర్తించారు. టైగర్ సంభాషణలపై చెవి పెట్టిన ఇంటెలిజన్స్‌కు ఈ సారాంశం తెలిసింది. ఈ విషయాన్ని కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలకు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ సంభాషణలను ముంబయి పోలీసులు కూడా విన్నట్టు తమ కథనాల్లో ధ్రువీకరించారు. భారత్ అత్యంత వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఈ టైగర్ మెమన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. యాకుబ్ మెమన్ కేసును తుది విచారణ చేసిన న్యాయమూర్తుల ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 22 యేళ్ళ జైలు జీవితం తర్వాత గత నెల 30న యాకుబ్ మెమన్‌కు ఉరి శిక్ష అమలు చేసినప్పటి నుంచి డిల్లీలోను, ఇతర కీలక నగరాల్లోను భద్రతను మరింత పటిష్టం చేసినట్టు ఉన్నత పోలీసు వర్గాలు తెలిపాయి.
Advertisement