ఫిరాయింపులపై స్పీకర్‌కు మళ్ళీ హైకోర్టు నోటీసులు
తెలంగాణలోని కొంతమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను స్పీకరు తిరస్కరించడంతో మరోసారి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు తిరస్కరించడంపై కోర్టు స్పందిస్తూ కేసు పూర్వాపరాలను అనుసరించి విచారిస్తామని ప్రకటించింది. కేసును ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎంపికైన శాసనసభ్యులు టీఆర్ఎస్‌లో చేరినందున వారిపై పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో […]
Advertisement
తెలంగాణలోని కొంతమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను స్పీకరు తిరస్కరించడంతో మరోసారి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు తిరస్కరించడంపై కోర్టు స్పందిస్తూ కేసు పూర్వాపరాలను అనుసరించి విచారిస్తామని ప్రకటించింది. కేసును ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎంపికైన శాసనసభ్యులు టీఆర్ఎస్‌లో చేరినందున వారిపై పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్పీకరుకు మరోసారి నోటీసులు జారీ చేసింది.
Advertisement