బాబు ప్రజలవైపా? కేంద్రం వైపా?
సీపీఐ నేత నారాయణకు పెద్ద చిక్కే వచ్చిపడింది. దానిపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అదేమిటంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల వైపా? లేక కేంద్రం వైపా? అన్నది నారాయణకు తెలియడం లేదు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చంద్రబాబు నాయుడు ఎవరివైపు నిలుస్తారు? అని నారాయణ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజల పక్షాన నిలుస్తారో లేక ఏపీకి ద్రోహం చేసిన కేంద్రం వైపు నిలుస్తారో తేల్చుకోవాలని నారాయణ అల్టిమేటమ్ ఇచ్చారు. చంద్రబాబు ప్రజల పక్షాన […]
Advertisement
సీపీఐ నేత నారాయణకు పెద్ద చిక్కే వచ్చిపడింది. దానిపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అదేమిటంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల వైపా? లేక కేంద్రం వైపా? అన్నది నారాయణకు తెలియడం లేదు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చంద్రబాబు నాయుడు ఎవరివైపు నిలుస్తారు? అని నారాయణ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజల పక్షాన నిలుస్తారో లేక ఏపీకి ద్రోహం చేసిన కేంద్రం వైపు నిలుస్తారో తేల్చుకోవాలని నారాయణ అల్టిమేటమ్ ఇచ్చారు. చంద్రబాబు ప్రజల పక్షాన ఉండాలనుకుంటే వెంటనే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. లేకుంటే తెలుగుదేశం పార్టీ బతకడం కష్టమని కూడా నారాయణ జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు పాతదే అయినా రాష్ట్రం కొత్తదని, కనీస మౌలిక సదుపాయాలు లేవని, అందువల్ల అన్నివిధాలుగా సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నారాయణ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 11న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని ఆయన తెలిపారు. సీపీఐ ఎంపీ డి.రాజాతో కలసి నారాయణ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకుని ఏపీకి ప్రత్యేక హోదాపై వినతిపత్రం సమర్పించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Advertisement