ఆందోళనలతో ప్రత్యేక హోదా రాదు
తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఓ కొత్త సూత్రీకరణ చేశారు. ఆందోళనలతో ఏమీ సాధించలేమని, ప్రత్యేక హోదా కూడా రాదని ఆయన చెబుతున్నారు. పార్లమెంటులో ఆందోళనలతో ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే మేము అదే చేయించేవాళ్లమని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ ఎంపీలతో కలసి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తుండగా మీరు ఎందుకు పోరాడడం లేదని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన జవాబిస్తూ మేం మిత్ర పక్షంలో […]
Advertisement
తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఓ కొత్త సూత్రీకరణ చేశారు. ఆందోళనలతో ఏమీ సాధించలేమని, ప్రత్యేక హోదా కూడా రాదని ఆయన చెబుతున్నారు. పార్లమెంటులో ఆందోళనలతో ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే మేము అదే చేయించేవాళ్లమని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీ ఎంపీలతో కలసి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆందోళన చేస్తుండగా మీరు ఎందుకు పోరాడడం లేదని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన జవాబిస్తూ మేం మిత్ర పక్షంలో ఉన్నాం… ఆందోళనతో ప్రత్యేక హోదా వస్తుందనుకుంటే మేం అదే చేయించేవాళ్లం. పార్టీ సిద్ధాంతం ప్రకారం చర్చలు చేస్తున్నాం. వచ్చేవారం ప్రధాని మోడీని కలవడానికి సమయం అడగనున్నాం అని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే స్టాండింగ్ కమిటీ లేదా సెలక్ట్ కమిటీ వేయాలని కోరతాం.. అని తెలిపారు. సభలను అడ్డుకోవడం వల్ల ప్రత్యేక హోదా, విభజన సమస్యల అంశాలను లేవనెత్తే అవకాశం లేక ఏపీకి అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రధాని సిద్ధంగా లేరన్న తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యలపై విలేకరులు స్పందించాలని అడగ్గా తాను చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నానని, ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయమవుతుందని బదులిచ్చారు.
Advertisement