బాబుకు సంతోషాన్నివ్వని విహారయాత్ర!
ఓటుకు కోట్లు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు, గోదావరి పుష్కరాలలో 30 మంది తొక్కిసలాట మరణాలు వంటి ఘటనలతో ఉక్కిరి బిక్కిరయిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సకుటుంబ సమేతంగా టర్కీకి విహారయాత్రకు వెళ్లారు. అయితే ఆ విహార యాత్ర ఆయనకు అంతగా సంతోషాన్నివ్వడం లేదని చంద్రబాబు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు యాత్ర ప్రారంభం కాగానే సోషల్‌మీడియాలో దానిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకుని ముఖ్యమంత్రి విహారయాత్రకు వెళ్లడం బాధ్యతారాహిత్యమని […]
Advertisement
ఓటుకు కోట్లు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు, గోదావరి పుష్కరాలలో 30 మంది తొక్కిసలాట మరణాలు వంటి ఘటనలతో ఉక్కిరి బిక్కిరయిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సకుటుంబ సమేతంగా టర్కీకి విహారయాత్రకు వెళ్లారు. అయితే ఆ విహార యాత్ర ఆయనకు అంతగా సంతోషాన్నివ్వడం లేదని చంద్రబాబు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబు యాత్ర ప్రారంభం కాగానే సోషల్‌మీడియాలో దానిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకుని ముఖ్యమంత్రి విహారయాత్రకు వెళ్లడం బాధ్యతారాహిత్యమని నెటిజన్లు మండిపడ్డారు. పైగా అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణాజిల్లాలో విషజ్వరాల వల్ల మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లారు. దాంతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంపై సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. ఈ విషయాన్ని టూర్‌లో ఉన్న చంద్రబాబుకు ఆయన సన్నిహితులు చేరవేశారట. దాంతో ఆయన ఎక్కడ లేని గాభరా పడ్డారట. నష్టనివారణ చర్యలకు మంత్రులను, సన్నిహితులను పురమాయించడంతో వారు గత రెండు రోజులుగా అదేపనిపై తలమునకలుగా ఉన్నారని సమాచారం. అందులో భాగంగానే రాష్ట్రంలో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టర్కీ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్నారని లీకులు విడుదల చేశారు. విహార యాత్ర నుంచే చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్న లీకులు కూడా మేలు కంటే కీడు చేశాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు విహార యాత్రకు బయల్దేరకముందే రాష్ట్రంలో కరువు, రైతు ఆత్మహత్యలు, మహిళా అధికారులపై దాష్టీకాలు, ర్యాగింగ్ మరణాలు, వ్యవసాయ పనులు లేక కూలీల వలసలు, గ్రాసం లేక పశువులు కబేళాలకు తరలడం వంటి వెన్నో సమస్యలు ఉన్నాయి. వాటిపై ఇక్కడ మాట్లాడకుండా టర్కీకి వెళ్లి సమీక్షలు నిర్వహించడమేమిటని నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ విషయం మళ్లీ ఆయనకు చేరవేయడంతో మీరంతా ఎందుకు దండగ నాకు… అంటూ చంద్రబాబు మండిపడ్డారట. అటు విహార యాత్రలో చంద్రబాబు… ఇక్కడ ఎటూ పాలుపోని స్థితిలో ఆయన అనుయాయులు టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisement