ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: మురళీమోహన్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని లోకసభలో టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ డిమాండ్‌ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి లేదన్నారు. లోక్‌సభలో ఆర్థికశాఖ అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన… విభజన జరిగి ఏడాదిన్నర అయినా విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను కూడా మురళీమోహన్‌ చదివి వినిపించారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన […]

Advertisement
Update:2015-08-06 02:34 IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని లోకసభలో టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ డిమాండ్‌ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి లేదన్నారు. లోక్‌సభలో ఆర్థికశాఖ అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన… విభజన జరిగి ఏడాదిన్నర అయినా విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను కూడా మురళీమోహన్‌ చదివి వినిపించారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలకు పార్లమెంటుపై నమ్మకం పోతుందన్నారు. మరో సభ్యుడు గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ… ఏపీని అసంబద్ధంగా విభజించినందువల్లే ఈ పరిస్థితులను ఎదుర్కొం టున్నామని అన్నారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని, అప్పట్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగానే ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయన్నారు. ఐదేళ్ల తర్వాత ఏపీ మాత్రమే లోటు బడ్జెట్‌ రాష్ట్రంగా మిగులుతుందని 14వ ఆర్థిక సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని, ఏపీకి కేంద్రం తగిన విధంగా న్యాయం చేయాలన్నారు.

హోదా వద్దన్నా… అదనపు సాయం చేస్తాం: అరుణ్‌జైట్లీ
సభ్యుల వాదనలపై స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ… విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఏపీకి ప్రత్యేక సాయం చేస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ లోటును భర్తీ చేయడంతోపాటు రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు కేంద్రం చేయూతనిస్తుందన్నారు. దేశాభివృద్ధిలో ఏపీ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఆర్థిక అంశాలకు సంబంధించినంత వరకూ ఏపీ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా ఏపీకి తొలి ఏడాది కొంత వరకు ఆర్థికసాయం చేశామన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదని, అయితే ఏపీని మిగిలిన రాష్ట్రాల కన్నా భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా ఆర్థిక సంఘం చెప్పిందన్నారు. దేశం గర్వించదగ్గ హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోవడం వల్ల ఏపీకి ఆర్థికంగా తీరని నష్టం జరిగిందన్నారు. టీడీపీ సభ్యులు కోరినట్లుగా ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక ఆర్థికసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా ఏపీకి అదనపు ఆర్థిక గ్రాంటు ఇవ్వాలని సూచించిందన్నారు. అయితే ఆర్థికసంఘం ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చి చెప్పిందన్నారు.
Tags:    
Advertisement

Similar News