సీఎం దగ్గరకు లెఫ్ట్ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి కలవాలని తొమ్మిది వామపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి అపాయిట్‌మెంట్ కోరినా నిరాకరించినందువల్ల తామే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. వామపక్షపార్టీల సమావేశంలో ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలపై వారు చర్చించారు. పారిశుధ్య కార్మికులు ఈనెల 10 వరకు నిర్వహించనున్న రిలే నిరాహారదీక్షలకు వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని, 11న తలపెట్టిన […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి కలవాలని తొమ్మిది వామపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి అపాయిట్‌మెంట్ కోరినా నిరాకరించినందువల్ల తామే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. వామపక్షపార్టీల సమావేశంలో ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న మొండి వైఖరి, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలపై వారు చర్చించారు. పారిశుధ్య కార్మికులు ఈనెల 10 వరకు నిర్వహించనున్న రిలే నిరాహారదీక్షలకు వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని, 11న తలపెట్టిన కలెక్టరేట్‌ల ముట్టడిలో కూడా పాల్గొంటామని వారు ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేతను కూడా అడ్డుకుంటామని వామపక్షాలు ప్రకటించాయి.
Advertisement