ధర్మాసనానికే ఇక పునర్విభజన కేసులు
ఏపీ పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే కేసులన్నీ హైకోర్టు ధర్మాసనం పరిధిలోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు రిట్ నిబంధనలను సవరించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై పునర్విభజన కేసులన్నీ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇప్పటివరకు ఈ కేసులను సింగల్ జడ్జి విచారిస్తూ వచ్చారు. తర్వాత ఆ తీర్పుపై మళ్లీ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు కావడం, ధర్మాసనం తీర్పులివ్వడం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతోందని […]
Advertisement
ఏపీ పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే కేసులన్నీ హైకోర్టు ధర్మాసనం పరిధిలోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు రిట్ నిబంధనలను సవరించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై పునర్విభజన కేసులన్నీ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇప్పటివరకు ఈ కేసులను సింగల్ జడ్జి విచారిస్తూ వచ్చారు. తర్వాత ఆ తీర్పుపై మళ్లీ ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు కావడం, ధర్మాసనం తీర్పులివ్వడం వంటి ప్రక్రియలకు చాలా సమయం పడుతోందని కనుక వాటిని నేరుగా ధర్మాసనమే విచారించాలని అభ్యర్ధనలు వచ్చాయి. అందుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని పరిపాలనా కమిటీ సానుకూలంగా స్పందించి ప్రొసీడింగ్ రూల్స్ 1977 రూల్ 14(ఏ), (4)కు సవరణలు చేసింది.
Advertisement