యథా మ్యాగీ..తథా నిషేధం
న్యూడుల్స్ మార్కెట్ మహారాజా మ్యాగీ.. మళ్లీ ఇండియా మార్కెట్‌లో వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది. కొన్ని రాష్ర్టాల్లో మ్యాగీపై నిషేధం ఎత్తేశారని, మ్యాగీలో హానికరమైన లెడ్ మోతాదుకు మించి లేదని గోవాలోని ఫుడ్ అండ్ డ్రగ్ ల్యాబొరేటరీ (ఎఫ్‌డిఎల్), మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎఫ్‌టిఆర్‌ఐ)లు సర్టిఫికెట్ ఇచ్చాయి. దీంతోపాటు మ్యాగీలో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేవంటూ ఈ సంస్థలు ధ్రువీకరించాయి. అయితే నెస్లేకు చెందిన మ్యాగీకి తాము క్లీన్ చిట్ ఇచ్చామని […]
Advertisement
న్యూడుల్స్ మార్కెట్ మహారాజా మ్యాగీ.. మళ్లీ ఇండియా మార్కెట్‌లో వచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది. కొన్ని రాష్ర్టాల్లో మ్యాగీపై నిషేధం ఎత్తేశారని, మ్యాగీలో హానికరమైన లెడ్ మోతాదుకు మించి లేదని గోవాలోని ఫుడ్ అండ్ డ్రగ్ ల్యాబొరేటరీ (ఎఫ్‌డిఎల్), మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎఫ్‌టిఆర్‌ఐ)లు సర్టిఫికెట్ ఇచ్చాయి. దీంతోపాటు మ్యాగీలో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేవంటూ ఈ సంస్థలు ధ్రువీకరించాయి. అయితే నెస్లేకు చెందిన మ్యాగీకి తాము క్లీన్ చిట్ ఇచ్చామని సాగుతున్న ప్రచారాన్నిభారత ఆహార భద్రత నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ఖండించింది. స్పష్టం చేసింది. మ్యాగీకి క్లీన్‌చిట్ ఇవ్వలేదని, నిషేధం అమల్లోనే ఉందని తేల్చిచెప్పింది. ఉత్తరప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయనాలున్నాయంటూ జూన్ 5న నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2.5 పిపిఎమ్ యూనిట్ల కంటే తక్కువ ఉండాల్సిన లెడ్.. 10 యూనిట్ల మేర ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ తేల్చిచెప్పింది. మార్కెట్‌లోకి మ్యాగీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలకు ఈ ప్రయత్నాలు ఊతమిస్తున్నాయి. అయితే యథా మ్యాగీ..తథా నిషేధం కొనసాగుతుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ స్పష్టం చేసింది.
Advertisement