పావుగంట తేడాతో ఒకేచోట 2 రైళ్ళకు ప్రమాదం

30 మంది దుర్మరణం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మాచక్‌ నది సమీపంలో కామయాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 బోగీలు పడిపోయాయి. కామాయని పట్టాలు తప్పిన పదిహేను నిమషాలకే జనతా ఎక్స్‌ప్రెస్‌ అదే స్థలిలో పట్టాలు తప్పింది. ఈ రెండు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల దాదాపు 30 మంది మరణించినట్టు తెలుస్తోంది. అయితే మృతులు 13 మందేనని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం మాచక్‌ నది దాటాక కల్వర్టు దగ్గర చోటు […]

Advertisement
Update:2015-08-05 04:04 IST

30 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మాచక్‌ నది సమీపంలో కామయాని ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 బోగీలు పడిపోయాయి. కామాయని పట్టాలు తప్పిన పదిహేను నిమషాలకే జనతా ఎక్స్‌ప్రెస్‌ అదే స్థలిలో పట్టాలు తప్పింది. ఈ రెండు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల దాదాపు 30 మంది మరణించినట్టు తెలుస్తోంది. అయితే మృతులు 13 మందేనని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదం మాచక్‌ నది దాటాక కల్వర్టు దగ్గర చోటు చేసుకుందని రైల్వే అధికారులు చెప్పారు. భారీవర్షాలకు కల్వర్టుపై రెండు ట్రాక్‌లు కుంగిపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. కల్వర్టు మీద రెండు వైపులా ఉప్పొంగుతున్న నీరు పట్టాలు తప్పిన బోగీల్లోకి చేరడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. ప్రయాణికుల్లో చాలామందిని రక్షించి, ఇటార్సీ రైల్వేస్టేషనుకు తరలించామని రైల్వేఅధికారులు వివరించారు. ఈ సంఘటనలో 300 మంది ప్రయాణికులను స్థానికులు కాపాడారు. గాయపడిన 100 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హర్దాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో రైళ్ళు పడిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఏం జరిగిందో తెలుసుకుని సంఘటన స్థలికి చేరుకుని వందలాది మందిని కాపాడారు. ముంబయి నుంచి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 11.45 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన జరిగిన విషయం తెలియక పోవడంతో అదేమార్గంలో వెనుకే వచ్చిన జనతా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. జబల్‌పూర్‌ నుంచి ముంబయి వెళుతున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ ఖిర్కియా- బిరంగి రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. ఈ రైలు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీవర్షాలకు పట్టాలు బిగువ కోల్పోయాయి. రైలు పట్టాల మీదకి వచ్చిన వెంటనే ప్రమాదాలు జరిగినట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ ఎ.కె.మిట్టల్‌ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News