భారత్‌కు పట్టుబడ్డ మరో 'కసబ్'
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు జమ్మూకాశ్మీర్‌లోని భద్రతాదళాలు. బుధవారం ఉదయం కొంతమంది టెర్రరిస్టులు రాష్ట్రంలోని ఉదంపూర్ జిల్లాలో జాతీయ రహదారిపై వెళుతున్నభద్రతాదళాల కాన్వాయ్‌పై అకస్మాత్తుగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ఒక టెర్రరిస్టు చనిపోయారు. 11 మంది జవాన్లు గాయపడ్డారు. కొంతమంది టెర్రరిస్టులు కూడా ఈ దాడిలో గాయపడి పారిపోయారు. ఇలా పారిపోయిన వారు ఓ గ్రామంలో ప్రవేశించి అక్కడ ముగ్గురు గ్రామస్థులను బందీలుగా […]
Advertisement
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు జమ్మూకాశ్మీర్‌లోని భద్రతాదళాలు. బుధవారం ఉదయం కొంతమంది టెర్రరిస్టులు రాష్ట్రంలోని ఉదంపూర్ జిల్లాలో జాతీయ రహదారిపై వెళుతున్నభద్రతాదళాల కాన్వాయ్‌పై అకస్మాత్తుగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ఒక టెర్రరిస్టు చనిపోయారు. 11 మంది జవాన్లు గాయపడ్డారు. కొంతమంది టెర్రరిస్టులు కూడా ఈ దాడిలో గాయపడి పారిపోయారు. ఇలా పారిపోయిన వారు ఓ గ్రామంలో ప్రవేశించి అక్కడ ముగ్గురు గ్రామస్థులను బందీలుగా తీసుకుపోయారు. ఈవిషయాన్ని తెలుసుకున్న భారత జవాన్లు చాకచక్యంగా ఆ ముగ్గురినీ విడిపించారు. ఇదే సమయంలో గాయపడిన ఒక తీవ్రవాది ఒకరు గ్రామస్థులకు తన పేరు ఖాసీంఖాన్‌గా చెప్పుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు పక్కా సమాచారం అందగానే సదరు ఆస్పత్రిపై దాడి చేసి ఉస్మాన్‌ఖాన్ అనే ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మాన్ నుంచి ఒక ఏకే-47 తుపాకిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని పైసలాబాద్‌కు చెందిన లష్కర్ తోయిబా ఉగ్రవాదిగా ఇతడ్ని భావిస్తున్నారు. ఇతను సుశిక్షితుడైన టెర్రరిస్టని, భారత్‌లో ఒక ప్రత్యేక పని కోసం ఇతడ్ని నియోగించారని తెలుస్తోందని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాద చర్యకి పాల్పడుతూ దొరికిపోయిన కసబ్ తర్వాత సజీవంగా దొరికింది ఉస్మాన్ ఖానేనని అధికార వర్గాలు తెలిపాయి.
ఉస్మాన్ భారత జవాన్లకు దొరికిపోవడం పట్ల ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న టెర్రరిస్టు ముఠాలకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నట్టు చెబుతున్నారు. ఉస్మాన్‌ఖాన్ ఐఎస్‌ఐకి చెందిన గుట్టుమట్లు ఎక్కడ విప్పేస్తాడోనని కలత చెందుతున్నారు. పోయిన వారం జరిగిన గురుదాస్‌పూర్ ఘటనకు అసలు కారకులెవరో తెలుసుకుంటే తమకు మరింత ఇబ్బంది కలుగుతుందని ఐఎస్‌ఐ భయపడుతోంది. భారత్ జవాన్లు ఉస్మాన్‌ను విచారించి అనేక విషయాలను రాబట్టాలను కుంటున్నారు. కాగా టెర్రరిస్టు రహిత ప్రాంతంగా భావిస్తున్న ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం పట్ల జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లా అప్పగించిన పనే చేస్తున్నా: ఉగ్రవాది ఉస్మాన్
అల్లా అప్పగించిన పనే తాను చేస్తున్నానని పాకిస్థాన్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ పేర్కొన్నాడు. తనను వదిలివేస్తే పాకిస్తాన్ వెళ్లిపోతానని వేడుకున్నాడు. ఉధంపూర్‌లో పట్టుబడిన తర్వాత భద్రతాదళాల సమక్షంలో ఉగ్రవాది మీడియాతో మాట్లాడాడు. నేను పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చి 12 రోజులైందని, తాను ఉదయం నుంచి ఏమీ తినలేదని, రోజంతా వర్షంలో తడుస్తూ, అడవిలో తిరుగుతున్నానని ఉస్మాన్ తెలిపాడు. అటు ఇటు తిరుగుతూ చివరికి ఇక్కడకు వచ్చానని, అల్లా అప్పగించిన పని చేస్తున్నానని తెలిపాడు. జరిగిన తప్పుకు ఎక్కడా పశ్చాత్తాపం పడకుండా ఉగ్రవాది ఉస్మాన్ నవ్వుతూ కనిపించాడు.