కొలంబియా మోడల్‌కు ఉరిశిక్ష?
చట్టానికెవరూ అతీతం కాదని నిరూపిస్తోంది చైనా. గత నెల 18వ తేదీన జులియానా లోపేజ్ అనే యువతి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ చైనా అధికారులకు దొరికిపోయింది. ‘సెకీడెలిక్’ అనే ఓ మత్తు మందు చాలా ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఈ మాదక ద్రవ్యాన్నే ఆమె చైనాలోని గాంగ్జౌ విమానాశ్రయం ద్వారా తరలించడానికి ప్రయత్నిస్తూ అక్కడ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. కొలంబియాకు చెందిన ఈ 22 యేళ్ళ జులియానా అక్కడ ప్రముఖ మోడల్ కూడా. మోడల్‌గా తన […]
Advertisement
చట్టానికెవరూ అతీతం కాదని నిరూపిస్తోంది చైనా. గత నెల 18వ తేదీన జులియానా లోపేజ్ అనే యువతి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ చైనా అధికారులకు దొరికిపోయింది. ‘సెకీడెలిక్’ అనే ఓ మత్తు మందు చాలా ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఈ మాదక ద్రవ్యాన్నే ఆమె చైనాలోని గాంగ్జౌ విమానాశ్రయం ద్వారా తరలించడానికి ప్రయత్నిస్తూ అక్కడ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. కొలంబియాకు చెందిన ఈ 22 యేళ్ళ జులియానా అక్కడ ప్రముఖ మోడల్ కూడా. మోడల్‌గా తన పని తాను చేసుకోకుండా మాదక ద్రవ్యాల సరఫరాలో డబ్బులు అధిక మొత్తంలో వస్తాయన్న ఆశతో ఆ వైపు దృష్టి సారించి కస్టమ్స్ అధికారుల దృష్టిలో పడిపోయింది. చైనాలో శిక్షలు కఠినతరంగా ఉంటాయన్న సంగతి ఆమెకు కూడా తెలుసు. అడ్డంగా ఇలా దొరికిపోయిన ఆమెకు అక్కడున్న నిబంధనల ప్రకారం ఉరిశిక్షగాని, జీవితఖైదుగాని పడే అవకాశం ఉంది. కటకటాల పాలైన ఈ మోడల్‌ను విడిపించడానికి, శిక్ష నుంచి తప్పించడానికి ఆమె తల్లిదండ్రులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంది. కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం జులియానా ఇపుడు బీజింగ్‌లోని కొలంబియా ఎంబసీలో ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement