మోదీ ప్రభుత్వానికి బిచ్చగాళ్ల సాయం
ఎవరన్నారు బిచ్చగాళ్లు ఎవ్వరికీ ఉపయోగపడరని? నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇకపై వాళ్ల సాయమే ఎక్కువ! మీరు రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు మోదీ కోసం బిచ్చగాళ్లు పాటలు పాడుతున్నాఆశ్చర్యపోకండి! స్వచ్ఛభారత్ అభియాన్, బేటీ బచావ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ఇకపై వాళ్లు రైళ్లలో జింగిల్స్ పాడబోతున్నారు. మోదీ వాడకం అలాంటిది: ప్రభుత్వ పథకాలను ఆమ్ ఆద్మీకి చేరువచేయడానికి ఏ అవకాశాన్నీవదలడం లేదు మోదీ యంత్రాంగం! అందుకే టీవీ, రేడియో, పత్రికల్లో ప్రకటనలతోబాటు భిక్షాటనతో జీవించే స్త్రీ,పురుషుల సేవలను కూడా వాడుకోవాలని నిర్ణయించింది. ఇందులో […]
ఎవరన్నారు బిచ్చగాళ్లు ఎవ్వరికీ ఉపయోగపడరని? నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇకపై వాళ్ల సాయమే ఎక్కువ! మీరు రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు మోదీ కోసం బిచ్చగాళ్లు పాటలు పాడుతున్నాఆశ్చర్యపోకండి! స్వచ్ఛభారత్ అభియాన్, బేటీ బచావ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ఇకపై వాళ్లు రైళ్లలో జింగిల్స్ పాడబోతున్నారు.
మోదీ వాడకం అలాంటిది:
ప్రభుత్వ పథకాలను ఆమ్ ఆద్మీకి చేరువచేయడానికి ఏ అవకాశాన్నీవదలడం లేదు మోదీ యంత్రాంగం! అందుకే టీవీ, రేడియో, పత్రికల్లో ప్రకటనలతోబాటు భిక్షాటనతో జీవించే స్త్రీ,పురుషుల సేవలను కూడా వాడుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముంబై రైళ్లలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రభుత్వ పథకాలపై సామాన్యలకు అవగాహన కలిగే విధంగా రూపొందించిన పాటలను 3000మంది బిచ్చగాళ్లకు నేర్పిస్తున్నారు. వారు రోజూ అనేక రైళ్లలో ప్రయాణిస్తూ బేటీ బచావ్..బేటీ పడావ్ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. కేంద్ర సమాచార ప్రసారమంత్రిత్వశాఖకు చెందిన సాంగ్స్ అండ్ డ్రామా డివిజన్ జింగిల్స్ రూపొందించింది. ఆల్ ఇండియా రేడియోతో కలిసి బిచ్చగాళ్లకు జింగిల్స్ నేర్పించే పనిలో ఉంది. అయితే పిల్లలను మాత్రం ఈ ప్రాజెక్టులో తీసుకోవడం లేదు. ముంబై నుంచి మొదలుపెట్టి క్రమంగా దేశంలోని అన్ని నగరాల్లో బిచ్చగాళ్ల ద్వారా కేంద్ర పథకాల ప్రచార కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. ఇందుకు ఎన్‌జీవోల సాయాన్ని కూడా తీసుకోబోతున్నారు.