ఏసీబీకి చిక్కిన తుళ్లూరు సర్వేయర్

అసలే కష్టంగా బతుకు నెట్టుకు వస్తున్న రైతులను అధికారుల అవినీతి దాహం మరింత కలవర పెడుతోంది. దీంతో అవినీతి పీడ వదిలించుకోవాలనుకున్న రైతు నేరుగా ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రూ.20 వేలు లంచం తీసుకుంటూ తుళ్లూరు సర్వేయర్ వరప్రసాద్ ఏసీబీకి చిక్కి పోయాడు. గతంలో కూడా వరప్రసాద్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో వరప్రసాద్‌ను పట్టుకున్నారు. అతనిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.

Advertisement
Update:2015-08-04 18:45 IST

Tags:    
Advertisement

Similar News