చౌతాలాకు సుప్రీం కోర్టులోను భంగపాటు
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు సుప్రీం కోర్టులో మరోసారి భంగపాటు ఎదురైంది. 2000 నాటి ఉపాధ్యాయ నియామకం స్కాంలో ఆయనతోపాటు కుమారుడు, మరో ముగ్గురికి 2013 జనవరి 16న ట్రయల్ కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. మే 5న ఢిల్లీ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. దీంతో నాటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 80 ఏళ్ళ చౌతాలా దీనిపై సుప్రీంకోర్టులో మరోసారి అపీల్ చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం మళ్ళీ తిరస్కరించింది. […]
Advertisement
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు సుప్రీం కోర్టులో మరోసారి భంగపాటు ఎదురైంది. 2000 నాటి ఉపాధ్యాయ నియామకం స్కాంలో ఆయనతోపాటు కుమారుడు, మరో ముగ్గురికి 2013 జనవరి 16న ట్రయల్ కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. మే 5న ఢిల్లీ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. దీంతో నాటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 80 ఏళ్ళ చౌతాలా దీనిపై సుప్రీంకోర్టులో మరోసారి అపీల్ చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం మళ్ళీ తిరస్కరించింది. చౌతాలా కుమారుడైన 54 ఏళ్ళ అజయ్ సింగ్ చౌతాలాతోపాటు ఇతర నిందితుల పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని పేర్కొంది. ఆరోగ్యపరమైన సమస్యలపై పెరోల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని వారికి సూచించింది.
Advertisement