'క్రిడా'లో అక్రమ లేఅవుట్లపై అధికారుల కొరడా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని సీఆర్‌డిఏ (క్రిడా) పరిధిలో గ్రామ కంఠానికి 500 మీటర్ల దూరం లోపు వేసిన లే అవుట్లకు నూతనంగా అనుమతుల మంజూరును నిలిపి వేశారు. రాజధాని ప్రకటన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు వేల ఎకరాలకు పైగా ఈ లేవుట్లకు ప్లాన్ ఆమోదం లభించడం లేదు. వీటి విలువ రెండు వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. అధికారులు విధించిన నిబంధనలను పెడచెవిన పెట్టి క్రిడా పరిధిలో వేసిన అక్రమ లేఅవుట్లపై అధికారులు […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని సీఆర్‌డిఏ (క్రిడా) పరిధిలో గ్రామ కంఠానికి 500 మీటర్ల దూరం లోపు వేసిన లే అవుట్లకు నూతనంగా అనుమతుల మంజూరును నిలిపి వేశారు. రాజధాని ప్రకటన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు వేల ఎకరాలకు పైగా ఈ లేవుట్లకు ప్లాన్ ఆమోదం లభించడం లేదు. వీటి విలువ రెండు వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. అధికారులు విధించిన నిబంధనలను పెడచెవిన పెట్టి క్రిడా పరిధిలో వేసిన అక్రమ లేఅవుట్లపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత మూడు రోజుల్లో 57 ఎకరాల్లో వేసి ఉన్న అక్రమ లే అవుట్లను ధ్వంసం చేశారు. ఈ లేఅవుట్లు వేసిన రియల్టర్లకు క్రిడా ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ చేసింది. మైలవరం మండలం వెల్వడంలో 36 ఎకరాలు, చంద్రాలలో 10 ఎకరాలు, మండల కేంద్రమైన జి.కొండూరులో 2.5 ఎకరాలు, కందులపాడులో 3 ఎకరాలు రెండు రోజుల్లోనే ధ్వంసం చేశారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో 10 ఎకరాల్లోని లే అవుట్‌ను ధ్వంసం చేశారు. లే అవుట్లలో నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్లు ఏర్పాటు చేయాలి. 10 శాతం రిజర్వు స్థలం వదలాలి. ఈ నిబంధనలను పాటించని రియల్టర్ల ప్లాన్ అప్రూవల్‌కు భారీ జరిమానాలు విధిస్తున్నారు.