ఖరీఫ్‌కి శ్రీశైలం నీరు లేనట్టే: కృష్ణా రివర్ బోర్డు
గత 45 యేళ్ళలో శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా రాకపోవడం ఇదే తొలిసారని, ఈ పరిస్థితిలో రైతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతాంగానికి నీరు విడుదల చేయడం సాధ్యం కాదని కృష్ణా నది నిర్వహక బోర్డు స్పష్టం చేసింది. నదిలో ఉన్న నీరు తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, ఇప్పుడు సాగునీరు విడుదల చేస్తే తాగునీటికి ప్రజలంతా కటకటలాడాల్సిన పరిస్థితి ఉంటుందని బోర్డు వివరించింది. సోమవారం సమావేశమైన నది నిర్వహక బోర్డు ఖరీఫ్‌కు నీరందించే […]
గత 45 యేళ్ళలో శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా రాకపోవడం ఇదే తొలిసారని, ఈ పరిస్థితిలో రైతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతాంగానికి నీరు విడుదల చేయడం సాధ్యం కాదని కృష్ణా నది నిర్వహక బోర్డు స్పష్టం చేసింది. నదిలో ఉన్న నీరు తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, ఇప్పుడు సాగునీరు విడుదల చేస్తే తాగునీటికి ప్రజలంతా కటకటలాడాల్సిన పరిస్థితి ఉంటుందని బోర్డు వివరించింది. సోమవారం సమావేశమైన నది నిర్వహక బోర్డు ఖరీఫ్‌కు నీరందించే విషయంలో మరోసారి సమావేశమవుతామని, నీటి వివరాలు తెలిపేందుకు వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని చర్చించామని తెలిపారు. గత 45 ఏళ్లలో శ్రీశైలానికి నీరు రాకపోవడం అన్న పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదని రికార్డులు చెబుతున్నాయని, రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని ఇరు రాష్ట్రాలకు నది నిర్వహక బోర్డు సూచించింది.