బాబు గెస్ట్ హౌస్ దారి కోసం 60 కోట్లా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దుబారా పతాక స్థాయికి చేరుకుంది. ఒకవైపు విరాళాల కోసం హుండీలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రత్యేక విమానలలో టూర్లు చేస్తూ హంగు ఆర్భాటాల కోసం వందల కోట్లు ఖర్చుపెడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయవాడ సమీపంలో ఆయన బస చేసే అతిథిగృహం ఆధునీకరణకు, మూడు రహదారులు వేసేందుకు రూ. 60 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అతిథి గృహానికి వెళ్లేందుకు 12 కిలోమీటర్ల మేర మూడు రహదారులను […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దుబారా పతాక స్థాయికి చేరుకుంది. ఒకవైపు విరాళాల కోసం హుండీలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రత్యేక విమానలలో టూర్లు చేస్తూ హంగు ఆర్భాటాల కోసం వందల కోట్లు ఖర్చుపెడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. విజయవాడ సమీపంలో ఆయన బస చేసే అతిథిగృహం ఆధునీకరణకు, మూడు రహదారులు వేసేందుకు రూ. 60 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అతిథి గృహానికి వెళ్లేందుకు 12 కిలోమీటర్ల మేర మూడు రహదారులను ప్రతిపాదించారు. ఇందులో కరకట్ట నుండి లింగమనేని అతిథి గృహానికి వెళ్లే రహదారిని జలవనరులశాఖ చేపట్టనుండగా, ఉండవల్లి గ్రామం నుండి వెళ్లే రహదారిని పంచాయితీరాజ్ శాఖ చేపట్టనుంది. అదేవిధంగా ఉండవల్లి గ్రామ పై భాగం నుండి వేసే రహదారిని ఆర్ అండ్‌బి శాఖ చేపట్టనుంది. సిఎం అతిథి గృహానికి సంబంధించిన పనులను సెప్టెంబరు 25లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం పనులను జలవనరులశాఖ, విద్యుత్తు, ఆర్‌అండ్‌బి, విఎంసిలు చేపట్టాయి. అయితే ఈ పనులన్నీ నామినేటెడ్ పద్ధతిలో కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Advertisement