ఈజిప్టులో 88 మంది టెర్రరిస్టుల హతం
విదేశీయులను కిడ్నాప్‌లు, బాంబు దాడులు చేస్తూ దేశాన్ని అస్థిర పర్చాలనుకున్న ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచి వెయ్యాలని ఈజిప్టు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆలోచనలో భాగంగా దేశంలో ఉగ్రవాదులు ఏమూలనున్నా అంతం చెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సైన్యం ఉగ్రవాదులపై విరుచుకుపడింది. కేవలం 12 రోజులలో 88 మంది ఉగ్రవాదులను అంతం చేసింది. అనేకమంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఉగ్రవాదులకు చెందిన అనేక వాహనాలను ద్వంసం చేసి, వారికి చెందిన 40 […]
Advertisement
విదేశీయులను కిడ్నాప్‌లు, బాంబు దాడులు చేస్తూ దేశాన్ని అస్థిర పర్చాలనుకున్న ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచి వెయ్యాలని ఈజిప్టు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆలోచనలో భాగంగా దేశంలో ఉగ్రవాదులు ఏమూలనున్నా అంతం చెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సైన్యం ఉగ్రవాదులపై విరుచుకుపడింది. కేవలం 12 రోజులలో 88 మంది ఉగ్రవాదులను అంతం చేసింది. అనేకమంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఉగ్రవాదులకు చెందిన అనేక వాహనాలను ద్వంసం చేసి, వారికి చెందిన 40 వ్యాన్లు, 36 బైక్ లు స్వాదీనం చేసుకున్నామని ఆదివారం ఈజిప్ట్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Advertisement